క్రిస్మస్ సందడి మొదలైంది. ప్రముఖ హోటల్స్ కేక్ మిక్సింగ్ తయారీతో ఆకట్టుకుంటున్నాయి. సంగీతాలాపనతో సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి మారుమోగుతోంది. కూకట్పల్లి ప్రాంతాలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అమీర్పేట, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కోఠిలో షాపింగ్ సందడి మొదలైంది.