డోన్: డోన్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
Dhone, Nandyal | May 14, 2026 నంద్యాల జిల్లా డోన్ టీచర్స్ కాలనీలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. కమ్మరి చైతన్య ఇంట్లో జరిగిన ఈ ఘటనలో ఫ్రిజ్ నుంచి ముఖ్యమైన ఆస్తి పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. కష్టపడి సంపాదించిన పత్రాలు కాలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.