నంద్యాల అర్బన్: నంద్యాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 28, 2026
నంద్యాల పట్టణంలోని మూలసాగరం ఎంఎస్ నగర్ సచివాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.