ఒంగోలు అర్బన్: జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామ సమీపంలో డివైడర్ను ఢీ కొట్టి సంఘటన స్థలంలోనే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు
Ongole Urban, Prakasam | Jun 17, 2026
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ని ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. మృతుడు కొండపి మండలం కే ఉప్పలపాడు గ్రామానికి చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. జరిగిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు