ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేసిన కూటమి నాయకులు
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి,తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం బిజెపి ఇన్చార్జి మొమిన్ షబానా కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూరితో ప్రపంచం అంతా భారత్ వైపు చూసేలా చేసి, భారతదేశాన్ని అగ్రరాజ్యంగా అడుగులు వేస్తూ, ముందుకు సాగుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఉండాలని ఆమె కోరారు.