హత్నూర: ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలి : రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద స్వామి
ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలని రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద మధవానంద స్వామి చేతుల మీదుగా సప్త నాగేంద్ర స్వామి ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ భక్తి భావంతో ముక్తి లభిస్తుందని మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. ప్రతిష్టాపనకు సహకరించిన తుపాజీ అనంత కిషన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ చైర్ పర్సన్ నిర్మలాజంగారెడ్డి భక్తులు పాల్గొన్నారు.