ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో కత్తెరతో భార్యను చంపి పరారైన, నిందితుడు చెన్నయ్య అరెస్టు, ఆళ్లగడ్డ డి.ఎస్.పి శ్రీనివాసరావు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములోని చాంద్ వీధిలో గురువారం భార్య పుష్పలతను కత్తెరతో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో భర్త చెన్నయ్య ముద్దాయిని గురువారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు మీడియా తెలిపారు, ఆళ్లగడ్డ టౌన్ పిఎస్ లో మీడియాతో డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టి హైవేలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు, 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు కోర్టుకు హాజరు పరచామన్నారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే పోలీసుల ను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు,