బేగంపేటలో మహిళ దారుణ హత్యకు గురైన కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. మహిళపై అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేసిన నిందితుడు వై. రెడ్డప్ప (38)ను అరెస్టు చేశారు. నిందితుడు రెడ్డప్ప మృతురాలు లిసాతో కలిసి మద్యం సేవించిన తర్వాత ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి, ప్రతిఘటించడంతో ఆగ్రహంతో గొంతు నులిమి చంపేసినట్లు పంజాగుట్ట SHO రామకృష్ణ వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు.