నారాయణ్‌ఖేడ్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బిజెపి, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయి: నారాయణఖేడ్‌లో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బిజెపి, బిఆర్ఎస్ పార్టీ లు అడ్డుపడుతున్నాయని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామకం కోసం అభిప్రాయ సేకరణ చేశారు. కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్లు పాల్గొన్నారు.