చిగురుమామిడి: మండల కేంద్రంలో తీవ్రమైన కోతుల బెడద, ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కోతుల బెడదతో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొందని చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా కోతుల గుంపు రావడంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. కోతుల బెడదతో ఇంట్లోనే బంధీలుగా ఉంటున్నామని, కనీసం నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద నుంచి మండలవాసులను విముక్తి కల్పించాలని కోరుతున్నారు.