కనిగిరి: వైసీపీ బలోపేతానికి పార్టీలో పదవులు పొందిన నాయకులు కృషి చేయాలి: వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందిన నాయకులు పార్టీ బలవపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దల నారాయణ యాదవ్ సూచించారు. సోమవారం కనిగిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ యువజన విభాగం కార్యదర్శిగా నియమితులైన మూల గోపాల్ రెడ్డి ని పార్టీ నాయకులతో కలిసి నారాయణ యాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... రానున్న ఏ ఎన్నికలోనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గంలో విజయం సాధించే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో కనిగిరి జడ్పిటిసి కస్తూరి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.