అనంతపురం నగర శివారులోని చిన్మయ నగర్ లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో పెయింటింగ్ పనులు చేసుకుంటున్న కార్మికుడి మృతి
Anantapur Urban, Anantapur | Apr 20, 2026
అనంతపురం నగర శివారులోని చిన్మయ నగర్ లో విద్యుత్ షాక్ కు గురై అనంతపురం నగరంలోని నాయక్ నగర్ కు చెందిన మహంతి నాయక్ అనే పెయింటింగ్ పనులు చేసుకుంటూ కార్మిక వృత్తి చేసుకున్న కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.