నంద్యాల అర్బన్: నంద్యాల- మహానంది మార్గంలో ఆకతాయిల హల్చల్
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
నంద్యాల-మహానంది మార్గంలోని రాళ్లవాగు వద్ద మద్యం మత్తులో కొందరు యువకులు భక్తులను, ప్రయాణికులను బెదిరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అల్లరి చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్గంలో రాత్రి ప్రయాణాలంటే ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.