ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీలు నిరసన, ట్రాఫిక్ అంతరాయం
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని సాగర్ సెంటర్లో మంగళవారం వామపక్ష పార్టీలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. పేదల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం వామపక్ష పార్టీలపై ఉక్కు పాదం మోపుతుందని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది.