Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: అవయవ దానానికి అంగీకరించిన కుటుంబాన్ని ఘనంగా సత్కరించిన కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | May 30, 2026
అవయవ దానం ఎంతో గొప్ప కార్యమని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. కొమ్మూరి లక్ష్మయ్య అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపిన అతని భార్యను, కుటుంబ సభ్యులను శనివారం ప్రకాశం భవనంలోని తన కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు. ప్రకాశం జిల్లాలోనే తొలిసారిగా ఈ అవయవాలను సమర్ధంగా ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా ఆయన అభినందించారు. ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య ( 52) ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంటి పెద్దను కోల్పోయి తీవ్రదుఃఖంలో ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబ సభ్యులు పెద్దమనసు చూపారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: అవయవ దానానికి అంగీకరించిన కుటుంబాన్ని ఘనంగా సత్కరించిన కలెక్టర్ రాజాబాబు - Ongole Urban News