సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో చిన్నారులకు సామూహిక భోగిపండ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,భోగి పండుగను పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు చిన్నారులకు భోగిపండ్లు వేశారు.స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గొబ్బెమ్మలు, గొబ్బిపాటలు, హరిదాసులు, చలిమంటల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించిన భోగిపండ్లు, చిన్నారులకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ నిర్వహించామని ఈవో తెలిపారు.