బేతంచెర్లలో పంటకు రేటు లేదని మామిడి రైతుల ఆవేదన
Dhone, Nandyal | Apr 29, 2025 మామిడి పండ్లకు రేటు లేక తీవ్రంగా నష్టపోతున్నామని బేతంచెర్ల మామిడి రైతులు వాపోతున్నారు. కేజీ మామిడి పండ్లు రూ.50 నుంచి రూ.60 వరకే ధర పలుకుతూ ఉంది. దీంతో మామిడి పంటకు పెట్టిన పెట్టుబడులు సైతం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన గాలివానలకు సుమారు మూడు టన్నుల మామిడికాయలు రాలిపోయాయని, తాము చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని రైతు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.