సంగారెడ్డి: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ మాసం : పాల్గొన్న మహిళ కమిషన్ సెక్రెటరీ పద్మజారమణ
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ పద్మజారమణ ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ఉపాధి ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ అందిస్తున్న సేవలను వివరించి మహిళల ఆర్థిక సామాజిక స్థాయిని బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం మహిళలకు శ్రీమంతాలు చేసి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.