డోన్: ప్రాజెక్టు నుంచి డోన్ కు వచ్చే త్రాగునీటిని పొలాలకు వినియోగిస్తే కఠిన చర్యలు ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 6, 2026 అక్రమంగా నీటిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి డోన్ పట్టణానికి సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్ మార్గంలో కొందరు పంట పొలాలకు నీటిని మళ్లించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటిని అక్రమంగా తరలించడం సరికాదన్నారు. దీనిని వెంటనే నిలిపివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.