పటాన్చెరు: రుద్రారం: 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
పటాన్చెరు పరిధి రుద్రారంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మైసమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లోనే మగబిడ్డ పుట్టాడు. ఈఎంటీ చిరంజీవి, పైలట్ రవీందర్ సకాలంలో స్పందించి డెలివరీ చేయడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.