విశాఖపట్నం: విశాఖలో అఖిల భారతీయ తెరపాంత్ యువక్ పరిషద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 మెగా రక్తదాన శిబిరం
విశాఖలో అఖిల భారతీయ తెరపాంత్ యువక్ పరిషద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 మెగా రక్తదాన శిబిరం.అఖిల భారతీయ తెరపాంత్ యువక్ పరిషద్ ఆధ్వర్యంలో వరల్డ్ బిగ్గెస్ట్ క్యాంపెయిన్ లో భాగంగా విశాఖలో సెప్టెంబర్ 17 , మెగా బ్లడ్ డొనేటెన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అని తెరపాంత్ యువక్ పరిషద్ విశాఖపట్నం సభ్యులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ మహా రక్తదానం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరం చేసి గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నామని తెలిపారు. విశాఖలో ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ శిభిరం ద్వారా రక్తం సేకరించి అందిస్తాము అని తెలిపారు.