ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు, మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు
Ongole Urban, Prakasam | May 25, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమైనాయి. జూన్ 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,728 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరి కోసం 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను పగడ్భందీగా నిర్వహించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.