ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు(మం)కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొని 5 మంది మృతి. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు...
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా ఐదుగురు మృతి.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా, చిక్క హోసల్లి మండలం బంగారు పేటకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో వెంకటేశప్ప (76), సతీష్ కుమార్ (34), మీనాక్షి (32)తో పాటు ఐదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు బలిత్ గౌడ్, రీతిక్ ఉన్నారు.వీరందరూ కారులో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఘటన జరిగింది.