సంతనూతలపాడు: బండ్లమూడి లో ఇటీవల దాడిలో గాయపడ్డ బాధితులను ఒంగోలు రిమ్స్ లో పరామర్శించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ మాదిగ
చీమకుర్తి మండలంలోని బండ్లమూడి లో ఇటీవల ఓవర్గం దాడిలో గాయపడిన బాధితులను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలలో శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలపై దాడి చేయడం అమానుష ఘటనని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.