బనగానపల్లె: బనగానపల్లెలో జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని స్టాంప్ రైటర్ల నిరసన
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు సంబంధించిన జీఓ ఎంఎస్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని బనగానపల్లె స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ నిర్ణయంతో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్ల జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓను రద్దు చేసి రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరించకుండా ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలన్నారు