ఆళ్లగడ్డ: పడకండ్ల గ్రామంలో స్మశాన వాటికకు సరిహద్దు ఏర్పాటు చేయాలని, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని పడ కండ్ల గ్రామంలోని స్మశాన వాటికకు సరిహద్దు ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం గ్రామ పెద్దలు మండల తాసిల్దార్ జ్యోతి రత్నకుమార్ కి వినతి పత్రం అందించారు, గ్రామ పెద్దలు బద్రి సుధాకర్ రెడ్డి, పాంపల్లి మద్దిలేటి, వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం ఇచ్చారు, గతంలో ఈ స్మశానానికి వెళ్లే దారిలో ఉన్న ముళ్ల కంపలను విశ్వ హిందూ పరిషత్ ద్వారా తొలగించామని తెలిపారు