అనంతపురం అర్బన్: వివాహ వేడుకలకు మామిడికాయలు తెచ్చేందుకు వెళ్లి ఆటో ప్రమాదంలో వృద్ధుడు మృతి
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని కడదరకుంట వద్ద జాతీయ రహదారిపై మామిడికాయల లోడుతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో కూడేరు మండలంలోని బి నారాయణపురం కు చెందిన దోన స్వామి రెడ్డి అనే వృద్ధుడు మృతి చెందాడు. మరో రెండు రోజుల్లో తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకలకు మామిడికాయలు కొనుగోలు చేసి గ్రామానికి వెళుతుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.