కదిరి మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం పట్టా భూముల జోలికి పేర్లబోమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.
కదిరి మండలంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమిని సేకరిస్తామని ప్రైవేటు పట్టా భూముల జోలికి వెళ్ళబోమని రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సోమవారం స్పష్టం చేశారు. కొంతమంది వైకాపా నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కదిరిలో ఉన్నది కందికుంట వెంకటప్రసాద్ అనేది గుర్తించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో పట్టా భూముల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు.