అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం రామసాగరం గ్రామం వద్ద శనివారం రాత్రి మూడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి రాగి వైర్లను చోరీ చేయడంపై ఆదివారం పోలీసులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్టేషన్ ట్రైనింగ్ ఎస్సై మహేష్ పోలీస్ కానిస్టేబుల్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. రైతులు ఓబులేష్ చౌదరి వెంకటస్వామి లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైరైన చోరీ చేయక మరో రైతు ఎర్రిస్వామి కి చెందిన ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి వెళ్లారని బాధిత రైతులు పేర్కొన్నారు.