మధిర: మధిర పట్టణంలో అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన
మధిర పట్టణంలోని లక్కీ టవర్ వద్ద గృహిణులకు అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. అగ్ని ప్రమాద నివారణకు ఎలా చర్యలు తీసుకోవాలనేది డెమో ద్వారా ఫైర్ సిబ్బంది తెలియజేశారు. బేకింగ్ సోడా, మట్టి, నీళ్లు ఉపయోగించి మంటలను ఎలా అదుపు చేయవచ్చో మహిళలకు వివరించారు.