బేతంచర్ల మండల పరిధిలోని వీరాయిపల్లిలో వైభవంగా పెద్దమ్మ తల్లి దేవర ఉత్సవాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ప్రతి ఇంటి నుండి అమ్మవారికి బోనాలు సమర్పించి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.