కర్నూలు: నవంబర్ 17వ తేదీన ఎమ్మార్పీఎస్ 'ఛలో ఢిల్లీ'కి పిలుపు: ఎమ్మార్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షుడు పాముల కుమార్
దళితుల ఆత్మగౌరవ నిరసనగా నవంబర్ 17న ఢిల్లీలో జరగనున్న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు పాముల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలులోని అంబేడ్కర్ భవనంలో ఆయన సంబంధిత పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో దళితులపై కులవివక్షత కొనసాగుతుందని, దానిని అరికట్టాలని డిమాండ్ చేశారు.