ఆళ్లగడ్డ: పాణ్యం వద్ద రోడ్డు ప్రమాదం ఆళ్లగడ్డ ఏఎస్ఐ సురేష్ కుమార్ మృతి
నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సురేష్ కుమార్ మృతి చెందారు, అనంతపురం నుంచి వివాహ వేడుకలకు హాజరై తిరిగి ఆళ్లగడ్డకు వస్తుండగా కారు టైరు పేలి డివైడర్లు ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ఏఎస్ఐ సురేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరో హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు, క్షతగాత్రులను చికిత్స కోసం నంద్యాల ఆస్పత్రికి తరలించారు.