కావలి: గౌరవరం వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
కావలి మండలం గౌరవరం గ్రామ సమీపంలోని నర్సరీ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. ఆయనకు 35 ఏళ్ల ఉంటాయని, వివరాలు తెలియాల్సి ఉందని రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై తిరుమలరెడ్డి తెలిపారు. మృతుడి తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. ఈ ఘటన సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.