శేర్లింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజీలోని అయ్యప్ప సొసైటీలో 684 గజాలలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి అయ్యప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న కట్టడాన్ని క్షేత్రస్థాయిలో రంగనాధ్ పరిశీలించారు.