చిత్తూరు అర్బన్: తిరుపతి గ్రాండ్ వరల్డ్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం, ప్రజలు ఆందోళన, అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Chittoor Urban, Chittoor | Jun 13, 2026
తిరుపతి గ్రాండ్ వరల్డ్ రోడ్డులో చిరుత పులి సంచరించిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇళ్ల సమీపానికి చిరుత రావడంతో ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. కొందరు ఇళ్ల పైకప్పుల నుంచి చిరుతను వీడియో తీశారు. చిరుత సంచారం విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు. నీటి కోసం చిరుత ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.