సంగారెడ్డి: 305 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత, లారీ తో పాటు డ్రైవర్ క్లీనర్ నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
అక్రమ రేషన్ బియ్యం తో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్న సంఘటన నరసాపూర్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు 305 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు గస్తీ నిర్వహించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో రేషన్ బియ్యం తో వెళ్తున్న లారీని పట్టుకొని, డ్రైవర్ క్లీనర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది