అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ యువకుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని కళ్యాణదుర్గం సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామానికి చెందిన తిమ్మరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.