అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అంటే భయం కాదు, ప్రజల్లో నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు. అలాగే గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.