మాచవరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులు లేక మహిళల ఇక్కట్లు
ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ పలనాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల నుంచి మాచవరం మీదుగా రేకులగడ్డ వరకు తక్కువ సర్వీసులు ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మాచవరం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బస్సులు నిండిపోయి మహిళలు ఫ్లాట్ఫామ్ పై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.