గూడూరు మండలం పోటుపాలెంలో 'రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం' కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ రైతులతో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ నగదు ఖాతాలో జమైందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్, శ్రీనివాసులు, కేవీ రాజు, శ్రావణి, చెంచురామయ్య, హరి కుమార్, నటశేఖర్, ప్రకాశ్ నాయుడు పాల్గొన్నారు.