తాడిపత్రి: పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని యల్లనూరు రోడ్డు బైపాస్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మంగళవారం బైపాస్ రోడ్డు వద్దకు చేరుకొని పనులను తనిఖీ చేసి సూచనలు ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువల నుంచి మురుగు బయటకు వస్తుండటంతో తాడిపత్రి మునిసిపల్ పారిశుధ్య కార్మికులు ఎన్నో ప్రయత్నాలు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేసేందుకు గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. వారు చేస్తున్న పనులను ఎమ్మెల్యే చూసారు.