సిరిసిల్ల: మహిళా సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఎన్ఎస్ఎస్ యూనిట్ టీజీటిడబ్ల్యూఆర్డీసీ వి తంగళ్లపల్లి
లక్ష్మీపూర్, రాజన్న సిరిసిల్ల టీజీటిడబ్ల్యూఆర్డీసీ (మహిళా కళాశాల), తంగళ్లపల్లి-సిరిసిల్ల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గ్రామీణా భివృద్దికి సంబంధించి 7 రోజుల ప్రత్యేక శిబిరంలో భాగంగా "మహిళా సాధికారత"పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సోమవారం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా సాధికార కేంద్రం కోఆర్డినేటర్ రోజా గారు మరియు లింగ సమానత్వ నిపుణురాలు దేవిక గారు హాజరై మహిళలకు ప్రేరణాత్మకమైన ఉపన్యాసాలు అందించారు.రోజా మాట్లాడుతూ – "ప్రతీ మహిళ తన హక్కులను తెలుసుకుని, ఆర్థికంగా, సామాజికంగా, విద్యా రంగంలో ముం