గుంతకల్లు: ఫ్రీ బస్సులు ఎత్తివేయండి సార్: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా ప్రయాణికులు
ఫ్రీ బస్సుల వల్ల ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నాం. ఫ్రీ బస్సులను ఎత్తివేయాలని మహిళా ప్రయాణికులు వరలక్ష్మి, లక్ష్మీ తదితరులు కోరారు. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు కు చెందిన మహిళలు అనంతపురం వెళ్లడానికి బుధవారం గుత్తి బస్టాండ్ కి వచ్చారు. అయితే బస్సులు పాయింట్ ఆపలేదు. బస్టాండ్ వెనుక భాగం నుంచే వెళ్లిపోయారు. ఉదయం 9 గంటల సమయంలో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సుల వల్లే ఇబ్బందులు పడుతున్నామని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుంటామని ఫ్రీ బస్సులో వద్దే వద్దని చేతులెత్తి నమస్కరించారు.