అనంతపురం అర్బన్: పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం ఊడేగోళం గ్రామానికి చెందిన తిప్పే స్వామి అనే వ్యక్తి గత నెల 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.