ఉరవకొండ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అనంతపురం జిల్లా ఉరవకొండ, కూడేరు మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పోలీసులు దాడులు నిర్వహించి 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఓ రెస్టారెంట్ సమీపంలో అక్రమంగా గుర్తు తెలియని వ్యక్తులు డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టామని ఉరవకొండ సిఐ మహానంది మంగళవారం ఉదయం పేర్కొన్నారు. కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లి వద్ద ప్రధానదారిలో వాహనాల తనిఖీలో బొలెరో వాహనంలో తరలిస్తున్న 140 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై జమాల్ భాషా పేర్కొన్నారు.