గుంటూరు: కోరిటపాడులో వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి ఓ హాస్పిటల్లో చెలరేగిన మంటలు
Guntur, Guntur | Sep 14, 2025 ఆదివారం రాత్రి గుంటూరు కొరిటపాడులో జరిగిన వినాయక చవితి నిమర్జనం ఊరేగింపు యాత్రలో అపశృతి చోటి చేసుకుంది. నిమర్జనం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న యాత్రలో బాణాసంచా కాలుస్తూ ఉండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న హాస్పిటల్ పై పడ్డాయి. హాస్పటల్లో ఉన్న జనరేటర్ అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. జరిగిన ఘటన గురించి స్థానిక పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు వివరించారు.