బనగానపల్లె: బనగానపల్లెలో వైద్యుల నిర్లక్ష్యానికి 8 నెలల చిన్నారి మృతి : సిపిఐ మండల కార్యదర్శి శివయ్య
బనగానపల్లె పట్టణంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యానికి 8 నెలల చిన్న పాప శ్రీ సత్య మరణానికి కారణమయ్యారని సిపిఐ మండల కార్యదర్శి శివయ్య ఆరోపించారు. పసపల గ్రామానికి చెందిన కమలహాసన్ నాగేశ్వరి తమ శ్రీ సత్య కు జలుబు చేసిందని హాస్పిటల్కు తీసుకురావడం జరిగిందని అయితే డాక్టర్లు మూడు ఇంజక్షన్లు వేయడంతో డోస్ ఎక్కువ పాప అపస్మారతక స్థితిలోకి వెళ్లిందని ఇది గమనించిన ఆసుపత్రి సిబ్బంది పాపను నంద్యాల ఆస్పత్రికి తరలించగా అక్కడ పాప చనిపోయింది అన్నట్లు నిర్ధారించారని తెలిపారు పాప మరణానికి కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు