సంతనూతలపాడు: బీసీల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రూపొందించాలి: చీమకుర్తి లో జిల్లా బీసీ సంఘ నాయకులు శ్రీనివాస్
చీమకుర్తి పట్టణంలో శుక్రవారం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన జిల్లా బీసీ నాయకులు పిన్నిక శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇండియా కుటుంబ ప్రభుత్వం బీసీల రక్షణ కోసం తీసుకువస్తామని చెప్పిన బీసీ రక్షణ చట్టాన్ని తక్షణం రూపొందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.