ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సోమవారం వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం కేంద్రంలోని, వెలుగు కార్యాలయం లో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.బాలాయపల్లి మండల టిడిపి అధ్యక్షులు రాయి. సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్భార్ లో మండలం పరిధిలోని పలు సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,